ఆ దర్శకుడితో పని చేయాలనే కోరిక నాకు లేదు...చిరంజీవి..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తున్న  విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29 వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా,  ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించాడు.  రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చగా,  మణిశర్మ ఈ సినిమా కోసం సమకూర్చిన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.  


ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.  ఈ సినిమా తో పాటు మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ , గాడ్ ఫాదర్ ,  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  అలాగే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమాలో నటించబోతున్నాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి దర్శకత్వంలో పని చేయడం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు.  


కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటిస్తారు అని వార్తలు వచ్చాయి.  దానిపై చిరంజీవి స్పందిస్తూ... ఆచార్య సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటిస్తాననే వార్తలు నిజం లేదు. నాకు రాజమౌళి తో పని చేయాలనే కోరిక కూడా లేదు.  నేను రాజమౌళి తో కలిసి పని చేయను.  నాకు  ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినా నటించను.  నేను రాజమౌళి దర్శకత్వంలో పని చేయకపోవడానికి కారణం... రాజమౌళి ని నేను నటుడిగా ఎలా సంతృప్తి పరచాలో  తెలియదు. రాజమౌళి మెప్పించడం నాకు కష్టమే అనిపిస్తుంది అని చిరంజీవి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: