భర్త చనిపోయినా ఈ పనులేంటి మందిరా.. ట్రోల్స్ ఆగట్లేదుగా ?

VAMSI
మందిరా బేడీ ఈమె గురించి తెలియని వారు ఉండరు.ఆమె ఒక ప్రముఖ క్రికెట్ ,  టీవీ ప్రజెంటర్. అయితే మందిరా బేడీ ఇప్పుడు ట్రోలింగ్‌కు గురైంది. మందిరా భర్త రాజ్ కౌశల్ ఇటీవల కొన్ని నెలల కిందటే చనిపోవడంతో తన లైఫ్ లో ఆమె చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు.
 మరి అంతటి క్లిష్ట పారిస్తుతుల నుండి కొద్దీ కొద్దిగా బయట పడుతున్న ఆమె తన పిల్లల్ని ఎనో బాధ్యతగా చూసుకుంటుంది.

అంతేకాదు తన మోటివేషనల్ కోట్స్‌, వర్కవుట్ పిక్చర్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌తో కూడా టచ్‌లో ఉంటోంది. అంత బాగుంది అనుకుంటున్నా సమయంలో ఆమె తన ఇన్‌స్టాలో పోస్టు చేసిన పిక్ ఒకటి ఆమెను ట్రోలింగ్ కు గురుచేస్తోంది. అది ఏమిటంటే ఆమె తన మేల్ ఫ్రెండ్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో అతి సన్నిహితంగా ఉండేటి  కొన్ని పిక్చర్స్‌ను గడిచిన సోమవారం తన ఇన్‌స్టాలో పోస్టు చేయటడం తో ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గ మారింది.

అంతేకాకుండా ఆ పిక్చర్స్ తోపాటు అతనికి  'హ్యాపీ బర్త్‌డే ఆది. నువ్వు నాకు ఎంత ఆప్తమిత్రుడివో  మనం ఎంతకాలంగా ఒకరికొకరం బాగా తెలుసో, నేను నిన్ను ఎంతగా విశ్వసిస్తున్నానో అని చెప్పేటందుకు ఈ ఒక్క ఫొటో చాలు కదా (స్విమ్మింగ్ పూల్‌లో, కోవిడ్ టైమ్‌లో అతని ముక్కులో వేలు పెట్టడంపై) లవ్ యూ' అంటూ ఒక నోట్ కూడా జత చేసింది. దీనితో ఈ పిక్‌ చూసిన నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తూ ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో ఆ ట్రోల్స్ తో విసుగు చెందిన మందిర తన పోస్టుకు కామెంట్స్ ఆఫ్ చేసింది. కాగా మందిర బేడీ  భర్త రాజ్ కౌశల్ గతేడాది జూన్‌లో గుండెపోటు కారణంగా మరణించిన సంగతి అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: