
రవితేజ పై ప్రయోగిస్తున్న ఆచార్య గుణపాఠాలు !
ఈసినిమా టాప్ ఎలా ఉన్నప్పటికీ ఈమూవీ ఫస్ట్ డే కలక్షన్స్ కూడ అత్యంత తక్కువ స్థాయిలో రావడంతో చిరంజీవితో సినిమాలు తీస్తున్న నిర్మాతలలో కొత్త ఆలోచనలు మొదలైనట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీ ఫలితం రీత్యా చిరంజీవి భవిష్యత్ సినిమాల బడ్జెట్ విషయంలో మార్పులు చేర్పులు దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు టాక్.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ షూటింగ్ ఇంచుమించు పూర్తి కావడంతో ఈమూవీ బడ్జెట్ విషయంలో మార్పులు చేసే అవకాశం లేదు. అయితే దర్శకుడు బాబి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న మూవీ మల్టీ స్టారర్ కావడంతో ఆమూవీలోని మరో హీరో పాత్రకు రవితేజాను ఏరికోరి ఎంపిక చేసుకున్నాడు. ఈమూవీలో రవితేజ నటించడానికి ఒప్పుకున్నందుకు భారీ పారితోషికం కూడ ఆఫర్ చేసారని టాక్.
ఇప్పుడు ‘ఆచార్య’ ఫలితంతో ఆలోచనలు మారి ఈమూవీలో చిరంజీవి పక్కన రవితేజా కాకుండా మరొక చిన్న హీరోని పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు ఈమూవీ నిర్మాతలకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ కథ విషయంలో కూడ మళ్ళీ ఆలోచనలు మొదలయ్యాయి అని అంటున్నారు. ఇప్పటికే ఈమూవీ దర్శకుడు మెహర్ రమేష్ పై ఐరన్ లెగ్ దర్శకుడుగా పేరుపడిన పరిస్థితులలో ఈమూవీ విషయమై కూడ ఈమూవీ నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నట్లు గుసగుసలు వినిపస్తున్నాయి. ఇప్పటివరకు చిరంజీవి సినిమా అంటే చాలు ఎంత పెట్టుబడికి అయినా ఓకె చెప్పే నిర్మాతలకు ‘ఆచార్య’ ఫలితం టెన్షన్ పెడుతూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది..