"అశోకవనంలో అర్జున కళ్యాణం" కు విశ్వక్ సేన్ ఎంత తీసుకున్నాడో తెలుసా?
అయితే ఇప్పుడు ఒక విషయం విశ్వక్ గురించి వైరల్ గా మారింది. తాజాగా ఈయన నటించిన మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం. ఇందులో ఒక క్లాస్ యువకుడిగా నటించాడు. సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. పాటలు టీజర్ కూడా ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం పాగల్ సేన్ విశ్వక్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నాడు అన్న విషయం గురించి ఫ్యాన్స్ ఆరాతీస్తున్నారు. అయితే మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు గానూ విశ్వక్ సేన్ 4 కోట్లు తీసుకున్నాడట. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే ఇక తన రెమ్యూనరేషన్ ను మరో రెండు కోట్లు పెంచిన ఆశ్చర్యపడనక్కర్లేదు.
కాగా ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్ లలో రిలీజ్ కానుంది. మరి విశ్వక్ సేన్ తన అభిమానులను అలరిస్తాడా లేదా ఉసూరుమనిపిస్తాడా అన్నది తెలియాలంటే ఇంకో రెండు రోజుల వరకు ఆగాల్సిందే.