మరో సీక్వెల్ ను రెడీ చేయనున్న అనిల్..

Satvika
అనిల్ రావిపూడి సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే..కామెడీ, కుటుంబ కథలతో ఎక్కువగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈయన నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా మంచి హిట్ ను అందుకున్న సంగతి.గత ఏడాది వచ్చిన ఎఫ్2 సినిమా గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.సోలో మూవీగా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను అందుకుంది. ఆ ఏడాది మొత్తానికి ఆ సినిమానే టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.ఆ చిత్రంలో వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించారు. వీళ్లకు జోడిగా తమన్నా, మెహరీన్ నటించారు.


ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో సీక్వెల్ సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమానె ఎఫ్3.. ఆ సినిమా లో కూడా మొదటి సినిమాలో ఉన్న హీరో హీరోయిన్లు నటించారు.. ఇప్పుడు కథను పెంచారు .మరింత జోష్ ను పెంచారు. కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఎఫ్3 సినిమా ప్రేక్షకుల ను ఎంతమేర ఆకట్టుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్2 చిత్రం ప్రేక్షకుల ను ఆకట్టుకోవడం లో పూర్తిగా సక్సెస్ అయ్యింది.


ఇప్పుడు వస్తున్న ఎఫ్3 ఎఫ్3 మూవీని ప్రేక్షకులు ఆదరిస్తే, వెంటనే ఎఫ్4 సినిమాను మొదలుపెట్టేందుకు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ ఎఫ్3కి నెగెటివ్ రిజల్ట్ వస్తే, కొంత గ్యాప్ తీసుకున్న తరువాతే ఎఫ్4 చిత్రాన్ని పట్టాలెక్కించాలని అనిల్ రావిపూడి నిర్ణయించుకున్నాడట. ఏదేమైనా ఎఫ్3 ఇంకా రిలీజ్ కాకముందే, అప్పుడే ఎఫ్4 గురించి ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఈ వార్థలొ ఎంత నిజం వుందో తెలియాలంటే అనిల్ రావిపూడి మరో ప్రకటన ఇవ్వాల్సిందె.. ప్రస్తుతం డైరెక్టర్ మరో చిత్రం గురించి ఆలొచించ లేదని తెలుస్తుంది.. నెక్స్ట్ ఎ హీరో తో చెస్తరొ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: