మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 29 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ మూవీ లో రామ్ చరణ్ 'సిద్ధ' అనే పాత్రలో కనిపించగా, పూజా హెగ్డే , రామ్ చరణ్ జోడిగా నీలంబరి పాత్రలో నటించింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ని సాధించుకుంది. విడుదలైన మొదటి రోజు నుండే నెగెటివ్ టాక్ రావడంతో ఈ సినిమాకు కలెక్షన్ లు కూడా రోజు రోజుకు తగ్గుతూ వస్తున్నాయి. మొదటి రోజును మినహాయిస్తే ఈ సినిమా కలెక్షన్ లు ఆ తర్వాత రోజుల్లో చాలా వరకు తగ్గాయి. మొదటి రోజు తర్వాత అతి తక్కువ కలెక్షన్ లను మాత్రమే ఆచార్య మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగలుగుతుంది. ఇది ఇలా ఉంటే ఐదు రోజుల్లో ఆచార్య మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కలెక్షన్ లను సాధించిందో చూద్దాం.
ఆచార్య మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.50 కోట్ల కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర సాధించింది.
రెండవ రోజు 5.15 కోట్లు.
మూడవ రోజు 4.07 కోట్లు.
నాలుగవ రోజు 53 లక్షల కలెక్షన్లను సాధించింది.
ఐదవ రోజు ఆచార్య మూవీ నిజాం లో 35 లక్షలు , సీడెడ్ 10 లక్షలు , యూ ఎ 8 లక్షలు , ఈస్ట్ 4 లక్షలు , వెస్ట్ 5 లక్షలు , గుంటూర్ 4 లక్షలు , కృష్ణ 9 కక్షలు , నెల్లూర్ లో 7 లక్షల కలెక్షన్ లను సాధించింది. మొత్తంగా అయిదవ రోజు ఆచార్య మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 82 లక్షల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా, 1.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్సాఫీస్ ద్వారా సాధించింది.