చిరంజీవి... సల్మాన్ ఖాన్ తో స్టెప్ లు వేయించబోతున్న ప్రభుదేవా..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది.  మలయాళ లూసిఫర్  మూవీ లో మోహన్ లాల్ హీరోగా నటించాడు.  ఈ సినిమా మలయాళం లో మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.  


మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న  గాడ్ ఫాదర్ మూవీ ని ఎన్వీ ప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నాడు. అలాగే డేరింగ్ అండ్ డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే గాడ్ ఫాదర్ చిత్ర బృందం చిరంజీవి , సల్మాన్ ఖాన్ లపై ఒక సాంగ్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది.  వీరిద్దరి కలయికలో తెరకెక్కబోయే సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయబోతున్నాడు. 


చిరంజీవి ,  సల్మాన్ ఖాన్ ఇద్దరి తోనూ ప్రభుదేవా మూవీ లను తెరకెక్కించాడు. ఈ ఇద్దరి బాడీ లాంగ్వేజ్ లో పై కూడా ప్రభుదేవా కు మంచి అవగాహన ఉంది.  ఇది ఇలా ఉంటే ప్రభుదేవా కూడా తన వైపు నుంచి ఈ సాంగ్ కి అదిరిపోయే రేంజ్ లో కొరియోగ్రఫీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గాడ్ ఫాదర్ మూవీ చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో పాటు భోళా శంకర్ ,  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: