నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగడం మాత్రమే కాకుండా అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఫుల్ జోష్ ను చూపిస్తుంది. ప్రస్తుతం రష్మిక మందన వరుస బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో నటిస్తూనే విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ మూవీ తో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా రష్మీక మందన నటిస్తోంది. దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ , రష్మిక మందన లు కూడా నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఈ మూవీ లో రష్మిక మందన కథానాయిక కాదు , ఒక కీలకమైన పాత్రలో రష్మీక మందన ఈ మూవీ లో నటించింది. అఫ్రీన్ అనే కశ్మీర్ ముస్లిమ్ అమ్మాయిగా రష్మీక ఈ మూవీ లో కనిపిస్తుంది. అలాగే దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ... ఈ సినిమాలో రష్మిక మందన పాత్రకు పెద్దగా డైలాగ్ లు ఉండవు. రష్మిక మందన కళ్ళతో హావభావాలను పలికించే పాత్రను ఈ సినిమాలో చేసింది.
ఈ పాత్ర కోసం ఎంతో మందిని అనుకొని చివరగా రష్మిక మందన ను ఎంచుకున్నట్లు దర్శకుడు హను రాఘవపూడి తెలియజేశాడు. యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే క్యాప్షన్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు , ఈ సినిమాను తెలుగు మరియు మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు తాజా ఇంటర్వ్యూలో హను రాఘవపూడి తెలియజేశాడు. దర్శకుడు హను రాఘవపూడి అందాల రాక్షసి , కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలతో దర్శకుడిగా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఈ దర్శకుడు ఎక్కువగా ప్రేమకథ సినిమాలను తెరకెక్కిస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.