కేజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి వేసుకున్న డ్రెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
సినిమా నటీ నటులు వేసుకొనే దుస్తులపై ,  వారు ధరించే ఇతర వస్తువులపై ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.  అలాగే వారు వేసుకునే డ్రెస్ ఎంత ఖరీదు అయిందో తెలుసుకోవాలనే ఆసక్తి కూడా కొంత మందిలో నెలకొని ఉంటుంది.  ఇది ఇలా ఉంటే సినిమా హీరో హీరోయిన్ లు కూడా దాదాపు చాలా ఖరీదైన దుస్తులను మరియు ఖరీదైన కాస్ట్యూమ్ లను వాడుతూ ఉంటారు.  కొంత మంది సినీ తారలు వేసుకునే డ్రెస్ ల ఖరీదు లక్షల రూపాయల్లో కూడా ఉంటుంది.  అలాగే కొంత మంది అప్పుడప్పుడు కాస్త తక్కువ ధరతో  కూడిన దుస్తులను ధరిస్తూ ఉంటారు.  


ఇది ఇలా  ఉంటే తాజాగా 'కే జి ఎఫ్'  మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి వేసుకున్న డ్రెస్ ఖరీదు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.  కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు కె ఎఫ్ చాప్టర్ 2 సినిమా లతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న శ్రీనిధి శెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్లిన టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతోంది. ఈ ముద్దుగుమ్మ పై మీడియా కూడా ప్రత్యేక శ్రద్ద ను చూపిస్తుంది.  ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కే జి ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జి ఎఫ్ చాప్టర్ 2 ర సినిమా లతో అమాంతం పెరిగిపోయింది.  ఇది ఇలా ఉంటే తాజాగా కే జి ఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి లెహంగా ధరించి ఫోటోలు దిగగా ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 


శ్రీనిధి శెట్టి  ధరించిన లెహంగా ఖరీదు 61,900 రూపాయలు కాగా , ఈ డ్రెస్ పౌలమి అండ్‌ హర్ష్‌ బ్రాండ్ కు సంబంధించినది. ఈ డ్రెస్ లో శ్రీనిధి శెట్టి ని చూసిన నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన కే జి ఎఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.  ఇప్పటికే కే జి ఎఫ్ చాప్టర్ 2  మూవీ  ప్రపంచ వ్యాప్తంగా 1000 మార్క్ ని టచ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: