బండ్ల గణేష్ కామెంట్స్ లో నైరాశ్యం !
అయితే ఇప్పుడు ఈబ్లాక బష్టర్ నిర్మాత స్వరం మారింది. తాను పవన్ కళ్యాణ్ తో సినిమా తీయనని ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. పవన్ త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని అంటూ పవన్ ఇలా వరసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతాడు అంటూ బండ్ల గణేష్ తన సందేహాన్ని వ్యక్తపరుస్తూ పవన్ పై సినిమాల ఒత్తిడి తగ్గించాలి అన్న ఉద్దేశ్యంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు.
పవన్ నటించే సినిమాల లిస్టు రోజురోజుకు పెరుగుతూనే ఉంది లేటెస్ట్ గా సముద్రఖని దర్శకత్వంలో పవన్ మరొక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా కాకుండా పవన్ నటించబోయే సినిమాల లిస్టు ఇంకా చాలానే ఉంది ‘జనసేన’ పార్టీ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన డబ్బు కోసం తాను సినిమాలలో నటిస్తున్నట్లు ఇప్పటికే పవన్ ఓపెన్ గానే పలుసార్లు చెప్పాడు. ఇలాంటి పరిస్థితులలో పవన్ కు అత్యంత సన్నిహితుడైన బండ్ల గణేష్ కోరిక ఎందుకు నెరవేరలేదు అన్నది సమాధానంలేని ప్రశ్న.
ఇది ఇలా ఉండగా బండ్ల గణేష్ కొందరు టాప్ దర్శకులను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసాడు. టాప్ దర్శకులు ఇండస్ట్రీలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారని వారంతా నాగార్జున సాగర్ డామ్ లోని వరద నీరు లాంటి వారని తాను మాత్రం నాగార్జున సాగర్ డామ్ లాంటి వాడినని చెపుతూ ఎంతమంది టాప్ దర్శకులు వచ్చి వెళ్ళిపోయినా తాను మాత్రం టాప్ నిర్మాతగా కొనసాగుతూనే ఉంటాను అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు..