టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ క్రేజీ హీరోయిన్లలో ఒకరు అయిన సమంత గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. కొంత కాలం క్రితమే ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన సమంత , ఆ తర్వాత అతి తక్కువ కాలంలోనే పుష్ప పార్ట్ 1 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి తన అందచందాలతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను అలరించింది.
ఇలా ఇప్పటికే ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ , పుష్ప పార్ట్ 1 సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సమంత ప్రస్తుతం కూడా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సమంత , ప్రస్తుతం యశోదా సినిమాలో నటిస్తోంది. ఈ మధ్యేనే అందాల ముద్దుగుమ్మ సమంత 35 వ వసంతం లోకి అడుగు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అలాగే అదే రోజు ఏప్రిల్ 28 న సమంత నటించిన 'కణ్మనీ రాంబో ఖతీజా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీ లో సమంత తో పాటు నయనతార , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫిట్నెస్ వీడియోలు, కొటేషన్స్, ప్రమోషనల్ బ్రాండ్స్ తదితర పోస్ట్ లను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా సమంత తన ఇన్ స్టా లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోకి సమంత పెద్దదాన్ని... తెలివైనదాన్ని అనే కాప్షన్ ని జత చేసింది. తెల్లటి పువ్వులు పట్టుకుని అందమైన నవ్వు తో ఉన్న సమంత ఫొటల్ అతి తక్కువ సమయం లోనే నెట్టింట వైరల్ అయింది.