తాజా ఇంటర్వ్యూలో
తమన్నా మాట్లాడుతూ... ఇండస్ట్రీకి నేను వచ్చి అప్పుడే ఇంతకాలమైపోయిందా... అని అనిపిస్తోంది. చూస్తు ఉండగానే సీనియారిటీ పెరిగిపోయింది. సీనియారిటీ అనేది బాధ్యతలు పెంచుతుంది. కెరియర్ ప్రారంభంలో ఎలాంటి పాత్రలు చేసినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ సీనియార్టీ పెరిగిన తర్వాత ఎంచుకునే పాత్రల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. తమన్నా ఏంటి ఇలాంటి పాత్రలో నటించింది అని ఎవరితో అనిపించుకోకూడదు. అందుకే పాత్రల ఎంపిక విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తన తాజా ఇంటర్వ్యూలో
తమన్నా తెలియజేసింది.