ఈ మధ్య కాలంలో చాలా మంది నటీమణులు మోసపోతున్నారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే వారిని
ప్రేమ పేరిట లేదా అవకాశాల పేరిట కొంతమంది బడా సెలెబ్రెటీలు బాగా వాడుకుని చివరికి వదిలేస్తున్నారు.అలాగే మరి కొంతమంది నటీమణులు స్నేహితులని నమ్మిన అలా వారి చేతిలో ని పూర్తిగా మోసపోతూ ఇండస్ట్రీకి చాలా దూరమవుతున్నారు. మరికొంతమంది ప్రేమించి మోసపోయినప్పటికీ ఇండస్ట్రీలో బాగా నిలదొక్కుకుంటూ తామేంటో నిరూపించుకోవడానికి ఎంతగానో ట్రై చేస్తున్నారు. ఇలాంటి వారి లోని ఫేమస్ స్మాల్ స్క్రీన్ సీరియల్ నటి నవ్య స్వామి కూడా ఒకరు.
కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ హాట్
బ్యూటీ గత ఎనిమిది సంవత్సరాల లోనే తానేంటో నిరూపించుకుని ఇక తన టాలెంట్ తో సీరియల్స్ లో వరుసగా ఆఫర్లను అందుకుంటూ బిజీ అయిపోతుంది.ఇక ప్రస్తుతం ఒకవైపు సీరియల్స్ ని చేస్తూనే మరొకవైపు ఈటీవీ లో ప్రసారమవుతున్న పలురకాల షో లకు కూడా గెస్ట్ గా హాజరు అవుతోంది.
శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో కూడా ఈ హాట్
బ్యూటీ పాటిస్పెట్ చేస్తోంది. తాజాగా నవ్య స్వామి ఒకరిని ప్రేమించి మోసపోయాను అంటూ తన మనసులో మాటను బయటపెట్టింది. ఇక అదేంటో పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం.
కన్నడలో థంగలి అనే సీరియల్ ద్వారా తన కెరీర్ ని స్టార్ట్ చేసింది హాట్
బ్యూటీ నవ్య స్వామి. కొన్ని రోజుల క్రితం
ఆలీతో సరదాగా షో కి అటెండ్ అయిన ఈ అందాల బొమ్మ బుల్లితెర ఇండస్ట్రీలో మొదట తనకే
కరోనా వైరస్ సోకిందని చెప్పుకొచ్చింది. ఆ టైంలో తనతో ఎవరూ లేరు అని , బతికితే చాలు అనుకుంటూ రోజులు గడిపానని నవ్య స్వామి వాపోయింది. ఇక తాను ఉంటున్న గేటెడ్ కమ్యూనిటీ లోకి కూడా రానివ్వలేదు అని ఎక్కడికి వెళ్లాలో తెలియక రోజంతా కూడా కారులోనే కూర్చుని బాగా ఏడ్చాను అని తన ఆవేదన వ్యక్తం చేసింది. తన లైఫ్ లో ఎక్కువగా బాధ పడ్డ రోజులు అవే అని కూడా ఆమె తెలిపింది. ఇక అలాగే ఇంటర్వ్యూలో మీరు
లవ్ ఫెయిల్యూర్ అంట కదా అని అడగగా ఆమె అవును నిజమే నేను ఒక రాంగ్ పర్సన్ ను ప్రేమించాను. అందుకే మోసపోయాను అంటూ ఆమె తెలిపింది. ఇకపోతే తన సహ సీరియల్ నటుడు
రవి కృష్ణ తో ప్రేమాయణం నడుపుతుందని పుకార్లు వచ్చిన వర్తలపై స్పందిస్తూ తాము ఇద్దరం కేవలం స్నేహితులం మాత్రమేనని తోసిపుచ్చింది.