బాలీవుడ్ ప్రముఖ
హీరో మరియు కండల వీరుడు
సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బాలీవుడ్ టాప్ స్టార్ అయిన
సల్మాన్ ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాలో నటించనున్న సంగతి అందరికి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో
సల్మాన్ కి జోడీగా సిజ్లింగ్
బ్యూటీ పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుంది. కాగా ఈ సినిమాకి 'కభీ ఈద్ కభీ దివాళీ' అనే టైటిల్ ని లాక్ చేసినట్లు
మూవీ మేకర్స్ తెలియచేసారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఆయుష్ శర్మ,
జహీర్ ఇక్బాల్ లు
సల్మాన్ కు సోదరులుగా నటిస్తున్నారు. ఈ సినిమాని సాజిద్ నడియాడ్వాలా నిర్మించనున్నారట. వచ్చే నెల అనగా మే 11న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం అవుతుంది.
అయితే ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరోలలో ఒకరు అయిన విక్టరి
వెంకటేష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తాజాగా ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్గా మరో తెలుగు
హీరో అయిన జగపతి బాబు నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది.
టాలీవుడ్ లో విలన్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా జగపతి బాబు మారారు. ఇంతకు ముందు వరకు చాలా సినిమాలలో విలన్ గా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే జగపతి బాబుకి సెకండ్ లైఫ్ ఇచ్చింది మాత్రం
లెజెండ్ డైరెక్టర్
బోయపాటి శ్రీను అని చెప్పాలి.
ఈ సినిమాలో జగ్గు బాయ్ నటనకు
టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఇక అప్పటి నుండి వెనక్కు తిరిగి చూడలేదు. ఇప్పుడు
టాలీవుడ్ నుండి
బాలీవుడ్ కు వెళుతున్నాడు. మరి అక్కడ కూడా తమ హవా చూపిస్తాడా ? అన్నది తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ విషయం గురించి మేకర్స్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఇప్పుడు ఈ వార్త మాత్రం వైరల్గా మారింది. ఇక ఈ సినిమాకి దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.