తమ అభిమాన నటులకు దగ్గరయ్యేందుకు… ఫేవరేట్ స్టార్స్ గురించి తెలుసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఎక్కువగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.. తమకు ఇష్టమైన వంటకాలు ఇంకా ప్రదేశాలు సినిమాలే కాకుండా.. తమ వ్యక్తిగత విషయాలు అలాగే చిన్ననాటి ఫోటోస్ ఇంకా రేర్ పిక్చర్స్ షేర్ చేస్తూ.. అభిమానులకు చేరువవుతున్నారు సినిమా తారలు..ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీ తారల చిన్ననాటి ఫోటోస్ బాగా వైరల్ అవుతున్నాయి. కాజల్, సమంత, ప్రభాస్ ఇంకా నాని ఇలా ప్రతి హీరోహీరోయిన్ల చైల్డ్ హుడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ఈ స్టార్ హీరో చిన్ననాటి ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది.ఇక పైన ఆ ఫోటోలో చూశారు కదా.. అందమైన మోముతో.. అమయాకపు చూపులతో కనిపిస్తున్న ఈ బుడ్డొడు ఎవరో గుర్తుపట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు దక్షిణాదిలోనే స్టార్ హీరో. అతని తీరు పూర్తిగా విభిన్నం.. స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే… కేవలం లవర్ బాయ్ గానే కాదు.. మంచి మాస్ యాక్షన్ హీరోగానూ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ స్టార్ హీరో సినిమా కోసం ఫ్యాన్స్ మాత్రమే కాదు. సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అతను ఎవరో గుర్తుపట్టారా?
ఆ బుడ్డోడు మరెవరో కాదండోయ్.. తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్.ఈయన్ని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు తలా. తెలంగాణలోని సికింద్రాబాద్ లో మే 1 వ తేదీన 1971లో జన్మించాడు అజిత్. ప్రేమ పుస్తకం అనే సినిమాతో సినీ ప్రయాణం ప్రారంభించిన ఈ హ్యాండ్సమ్ హీరో.. ఆశ, ప్రేమలేఖ, వాలి, అద్భుతం, విశ్వాసం, ఎంతవాడు గానీ. ఇంకా బిల్లా.. అంటూ దాదాపు అరవై పై గా సినిమాల్లో నటించాడు.. ఇటీవల వలిమై సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని కూడా అందుకున్నాడు అజిత్.. నిజానికి ఈ స్టార్ హీరో స్టైలే వేరు.. తలనెరిసినా సరే .. జుట్టుకు రంగు ఇంకా ముఖానికి మేకప్ వేయకుండా చాలా న్యాచురల్‌గా ప్రేక్షకుల మనసులను దొచుకుంటాడు. అద్భుతం సినిమా షూటింగ్ సమయంలోనే తన తోటి నటి షాలినిని సిన్సియర్ గా ప్రేమించి… ఒక ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఇద్దరు సంతానం. కేవలం తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ అజిత్ కుమార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది..ఇక రేపు అజిత్ కుమార్ పుట్టినరోజు.