అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి తెలుగు నాట అనేక మంది అభిమానుల మనసు దోచుకొని టాలీవుడ్ స్టార్ కథానాయకుల్లో ఒకరిగా ప్రస్తుతం కూడా కొనసాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న సమంత కేవలం తెలుగు భాష సినిమాల్లో మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అలాగే ది ఫ్యామిలీ మాన్ సీజన్ టు వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో కూడా సమంత ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత 'కాతు వాకుల రెండు కాదల్' అనే తమిళ సినిమాలో నటించింది. ఈ సినిమానే తెలుగులో 'కణ్మనీ రాంబో ఖతీజా' పేరుతో విడుదల చేశారు. ఈ సినిమాలో సమంత తో పాటు నయనతార , విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, ఈ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో నయనతార తో కలిసి నటించిన సమంత తాజాగా నయనతార పై ప్రశంసల వర్షం కురిపించింది. సోషల్ మీడియా వేదికగా సమంత , నయనతార గురించి స్పందిస్తూ... నయనతార ఆమె లాంటి వారు ఎవరూ లేరు. ఆమె నిజమైనది , మరియు చాలా విధేయురాలు మరియు నేను కలుసుకున్న అత్యంత కష్టపడి పని చేసే వ్యక్తులలో నయనతార ఒకరు అంటూ నయనతార పై ప్రశంసల వర్షం కురిపించింది. ఇది ఇలా ఉంటే సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని యశోద సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.