టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయిన కొరటాల శివ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొరటాల శివ , రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అనుష్క , రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ లుగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్లను కూడా సాధించింది. ఇలా దర్శకుడిగా కెరియర్ ని మొదలు పెట్టిన మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్న కొరటాల శివ ఆ తర్వాత శ్రీ మంతుడు, జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కొరటాల శివ 'ఆచార్య' సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో నటించాడు. ఆచార్య సినిమా నిన్న అనగా ఏప్రిల్ 29 వ తేదీన భారీ ఎత్తున థియేటర్లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఆచార్య సినిమా విడుదలైన అన్ని చోట్ల నుండి విడుదలైన మొదటి షో నుండే మిక్సీడ్ టాక్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
దీంతో కొరటాల శివ మొదటి సారి ఆచార్య సినిమాకు దర్శకత్వం చేసే విషయంలో తడబడ్డాడు అని, ఇద్దరు స్టార్ హీరోలు సినిమాలో ఉన్నప్పటికీ సినిమాను సరిగా తెరకెక్కించ లేకపోయాడు అనే విమర్శలను కొరటాల శివ ఎదుర్కొంటున్నాడు. ఇలా ఆచార్య సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ రావడంతో కొరటాల శివ తన రెమ్యూనరేషన్ లో 50 శాతాన్ని ఆచార్య సినిమా డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త నెటింట్లో వైరల్ అవుతుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ఆచార్య ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.