మహేష్ బాబు తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ను పంచుకున్న కీర్తి సురేష్...

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ తాజాగా సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే.  ఈ సినిమాలో కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కథానాయికగా నటించగా,  ఈ సినిమాకు గీత గోవిందం సినిమాతో దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న పరశురామ్ దర్శకత్వం వహించాడు.  ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషన్ లను మొదలుపెట్టింది.


అందులో భాగంగా కీర్తి సురేష్ కూడా ఈ సినిమా ప్రమోషన్ లలో పాల్గొంటుంది.  టీవీ ఇంటర్వ్యూ మోడ్ ఆన్ . మహేష్ బాబు తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ పై కీర్తి సురేష్ పంచుకున్న అభిప్రాయాలు త్వరలో టీవీ ఆన్ లైన్ లో ప్రసారం కానున్నాయి.  అంటూ సోషల్ మీడియాలో సర్కారు వారి పాట చిత్ర బృందం తెలియజేసింది.  ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన కీర్తి సురేష్ ఫోటోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన కీర్తి సురేష్ ఫోటో నెటింట్లో  లో వైరల్ అవుతుంది.


ఇది ఇలా ఉంటే ఇప్పటికే సర్కారు వారి పాట సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల ఈ ప్రచార చిత్రాలకు  ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే సర్కారు వారి పాట చిత్రం నుండి కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా,  ఈ పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని కళావతి సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ ల కొద్దీ వ్యూస్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: