ప్రశాంత్ నీల్ చుట్టూ నీలకంఠాపురం సీక్రెట్ !
‘కేజీ ఎఫ్ 2’ కలక్షన్స్ సంచలనాలతో దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీ హోరెత్తిపోతోంది. దీనితో ఈ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి సెలెబ్రెటీగా మారిపోయాడు. ఇప్పటివరకు ప్రశాంత్ నీల్ తీసినవి కేవలం మూడే మూడు సినిమాలు అయినప్పటికీ అతి తక్కువ సినిమాలతో ఇండస్ట్రీ సంచలనంగా మారిన ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకునే విషయంలో చాలామందికి ఆశక్తి పెరిగింది.
ఇలాంటి పరిస్థితులలో ప్రశాంత్ నీల్ ఫ్యామిలీ బీజాలు రాయలసీమ ప్రాంతానికి చెందినట్లుగా తెలియడంతో సోషల్ మీడియాలో చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. ప్రశాంత్ నీల్ కూడ తెలుగు వాడే అని తెలుసుకుని మన తెలుగు రాష్ట్రాలలోని చాలామంది విపరీతంగా ఆనందపడుతున్నారు. ఇక వివరాలలోకి వెళితే ప్రశాంత్ నీల్ కుటుంబ నేపధ్యం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపరం జిల్లా మడకశిర నియోజక వర్గంలోని నీలకంఠా పురం గ్రామం అని అంటున్నారు.
అంతేకాదు కాంగ్రెస్ లో ఒకప్పుడు ప్రముఖ నాయకుడుగా వెలిగిన రఘువీరారెడ్డికి ప్రశాంత్ నీల్ బంధువు అట. రఘువీరారెడ్డి ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ రెడ్డి అన్నదమ్ముల పిల్లలు అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తండ్రి సుభాష్ కు పెళ్లైన తరువాత ఆయన బెంగళూరులో స్థిరపడ్డారట. అక్కడే చదువుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కన్నడ బిడ్డగా చలామణి అవుతున్నాడు. ప్రశాంత్ నీల్ తండ్రి సమాధి నీలకంఠాపురంలోనే ఉందని వార్తలు రావడంతో ప్రశాంత్ నీల్ ను తెలుగుబిడ్డ గా ముద్ర వేసేస్తున్నారు.
ఆయన పుట్టుకలో రాయలసీమ నేపధ్యం ఉంది కాబట్టి ఆయన సినిమాలు కూడ అన్నీ ఫ్యాక్షన్ నేపధ్యంలో ఉంటాయి అనుకోవాలి. లేటెస్ట్ గా ప్రభాస్ తో తీస్తున్న ‘సలార్’ మూవీ కోసం కేవలం ఇంట్రవెల్ ముందు వచ్చే సీన్ కోసం ఏకంగా 20 కోట్లు ఖర్చు పెట్టారు అని వస్తున్న వార్తలను బట్టి ప్రశాంత్ నీల్ ను నమ్ముకుని నిర్మాతలు ఎలాంటి భారీ సినిమాలు తీస్తున్నారో అర్థం అవుతుంది..