రాజమౌళి సెంటిమెంట్ ను నిజం చేసిన ఆచార్య టెన్షన్ లో జూనియర్ ?

Seetha Sailaja
రాజమౌళి దర్శకత్వంలో ఒక బ్లాక్ బష్టర్ మూవీలో నటించిన హీరోకు వెనువెంటనే అతడిని సూపర్ ఫ్లాప్ లు వెంటాడుతాయి అన్న సెంటిమెంట్ నిన్న విడుదలైన ‘ఆచార్య’ తో మరొకసారి రుజువైంది. రాజమౌళితో బ్లాక్ బష్టర్ హిట్స్ అందుకున్న జూనియర్ చరణ్ ప్రభాస్ రవితేజా నానీ లు ఆతరువాత నటించిన సినిమాలు ఫ్లాప్ లుగా మారడంతో రాజమౌళితో సినిమా తరువాత ఎంతటి గొప్ప హీరోలో అయినా ఫ్లాప్ ల గండం తప్పదా అన్నసందేహాలు చాలామందికి వచ్చాయి.


అయితే ‘ఆచార్య’ మూవీలో చరణ్ తో పాటు చిరంజీవి కూడ నటించడంతో ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడుతుందని చాలామంది అంచనాలు వేసుకున్నారు. చిరంజీవి కూడ అలాంటి సెంటిమెంట్స్ పై తనకు నమ్మకం లేదు అంటూ ఓపెన్ గానే చెప్పాడు. నిన్న విడుదలైన ‘ఆచార్య’ కు కనీసం డివైడ్ టాక్ రాలేదు సరికదా ఫ్లాప్ టాక్ రావడంతో ‘ఆచార్య’ రాజమౌళి సెంటిమెంట్ ను తప్పించుకోలేకపోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి.


సాధారణంగా టాప్ హీరోల సినిమాలు కనీసం వారి అభిమానులకు అయినా నచ్చుతాయి. అయితే ‘ఆచార్య’ మెగా అభిమానులకు కూడ నచ్చే విధంగా లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో విలన్లు అరాచకాలు చేస్తుంటే హీరో ఒక రక్షకుడిలా అక్కడ అడుగు పెట్టి వారి పని పట్టి ఆప్రాంతాన్ని కాపాడటం అన్నకథతో అనేక సినిమాలు వచ్చాయి.


సామాజిక చైతన్యంతో కలిగి ఉన్న సినిమాలను తీసే కొరటాల ఇలాంటి వీక్ పాయింట్ ను ఎందుకు ఎన్నుకున్నాడు ఎంతో అనుభవం ఉన్న చిరంజీవికి ఈకథ ఎలా నచ్చింది అన్న విషయం ఎవరికీ అర్థం కాని విషయంగా మారింది.  సినిమాలో భారీతనం తప్పితే కొత్తదనం రవ్వంత కూడా లేకపోవడంతో ‘ఆచార్య’ ఫ్లాప్ గా మారింది అన్నసంకేతాలు వస్తున్నాయి. దీనితో ‘ఆచార్య’ ఒక గుణపాఠం గా మారింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ కొమరం భీమ్ గా నటించి బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న కొరటాల జూనియర్ మూవీ ప్రాజెక్ట్ కు మళ్ళీ రాజమౌళి నెగిటివ్ సెంటిమెంట్ వెంటాడుతుంది అన్న భయం ఏర్పడితే ఆమూవీ మార్కెట్ పరిస్థితి ఏమిటి అంటూ కొందరు ఊహాగానాలు అప్పుడే ప్రారంభించారు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: