టాలీవుడ్ క్రేజీ దర్శకుల్లో ఒకరైన
శ్రీను వైట్ల గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీను వైట్ల తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి
టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. శ్రీను వైట్ల ఎక్కువశాతం తన సినిమాల్లో
కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ ను మిక్స్ చేసి సినిమాలను తెరకెక్కించి అలాంటి సినిమాలతో బ్లాక్బస్టర్ విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంలో దిట్ట. అలాంటి ఈ దర్శకుడు ప్రస్తుత కాలంలో మాత్రం బాక్సాఫీస్ దగ్గర విజయాలను అందుకోవడం చాలా వరకు స్లో అయ్యాడు అని చెప్పవచ్చు.
డీ , రెడీ , దూకుడు లాంటి వరుస విజయాలతో
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల్లో ఒకరిగా నిలిచిన
శ్రీను వైట్ల 'దూకుడు' సినిమా తర్వాత తెరకెక్కించిన సినిమాలు చాలా వరకూ
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దర్శకుడికి నిరాశనే మిగిల్చాయి. అయితే అలాంటి సందర్భం లోనే తనకు బాక్సాఫీస్ దగ్గర
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన డీ సినిమాకు సీక్వెల్ గా డీ అంటే డీ అనే సినిమాలో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించాడు. డీ అంటే డీ
సినిమా లో మంచు విష్ణు హీరోగా నటించబోతున్నట్లు కూడా
శ్రీను వైట్ల తెలియజేశాడు.
అయితే ఈ ప్రకటన వచ్చి చాలా కాలమే అవుతోంది కానీ ఇప్పటి వరకు ఈ
సినిమా మాత్రం ప్రారంభం కాలేదు. దానితో ఈ
సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్ల లేక ఆగిపోయినట్లే తెలియడం లేదు. ఇది ఇలా ఉంటే మంచు విష్ణు మాత్రం ప్రస్తుతం
గాలి నాగేశ్వరరావు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో
సన్నీ లియోన్ ఒక
హీరోయిన్ గా కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ
సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.