బుల్లితెరపై
లక్ష్మీ వాసుదేవ ఇప్పటికీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు కానీ.. గతంలో జెమినీ టీవీలో ప్రసారమయ్యే చి. ల. సౌ స్రవంతి అనే సీరియల్ ఆర్టిస్ట్ అంటే టక్కున గుర్తుపడతారు. ఇక ఈమె సీరియల్స్ తో పాటు తెలుగులో పాటలు ధారా వాహికలలో కూడా ప్రధాన పాత్రల్లో నటించేది. ఈ నటి ఎమోషనల్ నటనతో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునేది.
ఇక ఆ తరువాత తెలుగు నుండి
కన్నడ సీరియల్స్ లో ఎక్కువగా నటించడం మొదలుపెట్టింది.. ఇక అక్కడి నుండి ఈ నటిని ఎక్కువగా అక్కడి ప్రజలు ఇష్టపడడం మొదలు పెట్టారు.
ఇక అక్కడ కూడా ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో కూడా నటించి.. ఈమె మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఈ నటికి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. కొద్దిరోజులుగా ఈమె గ్లామర్ షో చేయడం మొదలు పెట్టింది. అయితే అందుకు కారణం ఏమిటా అని ఆరా తీయగా ఈమెకు సినిమాలో అవకాశాలు కూడా వస్తున్నాయి అని తెలుస్తోంది. సినిమాలలో అవసరమైతే బోల్డు పాత్రలలో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గా నిర్మాతలకు హామీ కూడా ఇచ్చినట్లు సమాచారం.
అయితే అందుకు తగ్గ పాత్ర , కథ డిమాండ్ చేస్తే ఎలాంటి షరతులు పెట్టదట. అయితే ఈమె ప్రస్తుత వయసు 40 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఈమె బోల్డ్ పాత్రలను ఎవరు చూస్తారు అని కామెంట్ కూడా వినిపించడంతో.. ఈమె తన గ్లామర్ యాంగిల్ ను తాజాగా బయటకు తీయడం జరిగింది. తాజాగా
బీచ్ వద్ద ఈమె ఫోటోలకి ఫోజులు ఇవ్వడంతో ఈమెను చూసి నిర్మాతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా మోడ్రన్ డ్రెస్సుల్లో ఈమె చేసే గ్లామర్ షో కి కొంత మంది నెటిజన్లు
ఫిదా అవుతూ ఉన్నారు.