చిరంజీవి రొమాంటిక్ స్టైల్ పై సెటైర్లు !

Seetha Sailaja

చిరంజీవి వయసు 67 సంవత్సరాలకు దగ్గర పడుతున్నప్పటికీ అతడు తాను ఇంకా రొమాంటిక్ యాక్షన్ హీరోని మాత్రమే అని తెలియచేయాలని ప్రస్తుతం చాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తాను ఇండస్ట్రీ పెద్ద దిక్కు మాత్రమే కాకుండా ఇప్పటికీ ఎప్పటికీ తాను ఫిలిం ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోని అన్న సంకేతాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇస్తున్నాడు.


‘కేజీ ఎఫ్ 2’ లాంటి డబ్బింగ్ సినిమా కలక్షన్స్ విషయంలో తెలుగు రాష్ట్రాలలో సంచలనాలు సృష్టించడంతో చిరంజీవి ‘ఆచార్య’ పై చాల ఒత్తిడి పెరిగింది. ఈ మూవీ కేవలం మెగా అభిమానులు మాత్రమే చూస్తే కలక్షన్స్ రికార్డులు రావు. అందువల్ల ఈ మూవీ మ్యానియాని పెంచి అందర్నీ ఈ మూవీ ధియేటర్ల వైపు మళ్ళించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు చిరంజీవి అనుసరిస్తున్నాడు.


లేటెస్ట్ గా జరిగిన ఈ మూవీ మీడియా సమావేశంలో చిరంజీవి పూజా హెగ్డే తో చాల సన్నిహితంగా మెలుగుతూ తాను ఇంకా రొమాంటిక్ హీరోని అన్న సంకేతాలు ఓపెన్ గానే ఇచ్చాడు. పూజా కొద్దిగా సిగ్గుపడుతున్నా అతడు పట్టించుకోలేదు. చరణ్ ను పక్కకు తప్పుకోమని తన పక్కన పూజాను నిలబెట్టుకుని మీడియా కెమెరాలకు ఇచ్చిన పోజులు చూసి మీడియా వర్గాలు కూడ ఆశ్చర్య పడ్డాయట. అయితే ఈ రొమాంటిక్ ఓవర్ యాక్షన్ పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడ సోషల్ మీడియాలో చిరంజీవి పై వస్తున్నాయి.


చిరంజీవి తన వయసు మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు అంటూ కొందరు సెటైర్లు వేస్తే మరికొందరు చిరంజీవి తన నటనతో జనాన్ని మెప్పించాలి కాని ఇలాంటి రొమాంటిక్ స్టైల్ తోనా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. అయితే ఈవిషయాలు ఏమీ చిరంజీవి పట్టించుకోడు కాబట్టి తాను రష్మిక తో కూడ రొమాన్స్ చేయడానికి రెడీ అంటూ ఓపెన్ గానే చెపుతున్నాడు. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో చిరంజీవి రొమాంటిక్ ఓవర్ యాక్షన్ పైనే చాల విమర్శలు వస్తున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: