మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ రోజు అనగా ఏప్రిల్ 29 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల ఈ సందర్భంగా చిత్ర బృందం అనేక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో మరియు సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఆచార్య సినిమాను ఫుల్ గా ప్రమోట్ చేస్తూ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని దర్శకుడు కొరటాల శివ ను ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా ఇంటర్వ్యూ చేశాడు.
దర్శకుడు హరీష్ శంకర్ , చిరంజీవి , రామ్ చరణ్ , కొరటాల శివ ను కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడగడం... ఆ ప్రశ్నలకు వారు కూడా అంతే ఆసక్తికరమైన సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ లో భాగంగా ఈ జనరేషన్ హీరోల్లో 'చంటబ్బాయ్' సినిమాను ఎవరు చేస్తే బాగుంటుందనే అనే ప్రశ్న చిరంజీవికి ఎదురైంది... ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇస్తూ... బన్నీ చాలా బాగా చేస్తాడు. కామెడీ టచ్ ఉన్న ఇలాంటి పాత్రలు బన్నీ చాలా బాగా చేయగలడు అని చిరంజీవి చెప్పుకొచ్చాడు.
రామ్ చరణ్ కాకుండా మీ దృష్టిలో మంచి డాన్సర్స్ ఎవరు అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి కి ఎదురుగా... ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం ఇస్తూ... వాళ్లూ వీళ్లూ కాదండీ, ప్రస్తుతం చాలా మంది చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. వీళ్లల్లా నేను చేయగలనా, అనే స్థాయిలో తారక్ , అల్లు అర్జున్ , నితిన్ , రామ్ చేస్తున్నారు. అందరూ కూడా అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు అని చిరంజీవి సమాధానమిచ్చాడు. ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.