కేజిఎఫ్ 2 "వైలెన్స్" హిట్ దెబ్బకు సినిమాల ట్రెండ్ మారుతోంది ?

VAMSI
కేజీఎఫ్ చిత్రం తరవాత అందరూ హీరోలు కూడా ఇపుడు ఒకే టార్గెట్ అంటున్నారట. కథ కొత్తగా ఉండాలి, దానితో పాటుగా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ తో మూవీ నిండి పోవాలి. కానీ అవి చాలా సహజంగా మన ఇండియన్స్ కు నచ్చేలా, వారు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. కానీ ఏదో స్పైడర్ మాన్ లా మేడలు దూకుతూ ఫైటింగ్ చేస్తున్నట్లు అసహజంగా ఎక్కడా అనిపించకూడదు. అలాంటి మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు, తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అని క్యాలిక్యులేట్ చేసి మరీ దర్శకులకు చెబుతున్నారట మన హీరోలు. సౌత్ లోనే కాదు, నార్త్ లోనూ ఇదే మాట హీరోల నోట వినిపిస్తోండటం విశేషం. మంచి కటౌట్ తో మాస్ ఆడియన్స్ మనసు గెలుచుకున్న ప్రభాస్ క్లీన్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ తో వచ్చి నిరాశ పరిచారు.

దాంతో ఇకపై వైలెన్స్ తో దూకుడు పెంచాల్సిందే అని ఫుల్ క్లారిటీతో ఉన్నారట డార్లింగ్. అందుకే ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సలార్ మూవీలో కూడా వైలెన్స్ మసాలా మరికాస్త దట్టించారని సమాచారం. సాప్ట్ హీరో మహేష్ కూడా ఈ సారి సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఓ రేంజ్ లో ఉండాలని నిర్ణయించుకున్నారట. ప్రిన్స్ తాజా చిత్రం సర్కారు వారి పాట చిత్రం లోనూ గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయట.  ఇక పుష్ప చిత్రంతో మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేసిన అల్లు అర్జున్ సైతం పుష్ప 2 లో అంతకు మించి అన్నట్లుగా యాక్షన్ ఎపిసోడ్స్ తగ్గేదే లే అంటున్నారట.

ఇక నార్త్ లోనూ షారుక్, హృతిక్ రోషన్ వంటి హీరోలు తమ చిత్రాల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాల్సిందే అని దర్శకులకు చెబుతున్నారట. మొత్తానికి రానున్న రోజుల్లో వచ్చే వరుస స్టార్ హీరోల చిత్రాలు ..మూడు యాక్షన్ ఎపిసోడ్లు ఆరు పంచ్ డైలాగ్ లు అన్నట్లుగా కళకళలాడుతు రానున్నాయి అని సమాచారం. అయితే సినిమాలో మాస్ యాక్షన్ ఒక్కటి ఉంటే సరిపోదు మంచి స్ట్రాంగ్ పాయింట్ ఉండాలి ... దానిని అంతే స్ట్రాంగ్ గా డీల్ చేయగలిగే డైరెక్టర్ ఉండాలి. అప్పుడే సినిమాలు హిట్ అవుతాయి... కలెక్షన్ ల వర్షం కురుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: