ఆ సినిమాలు అంటే డైరెక్టర్ కు చాలా ఇష్టమట..!!

Divya
మెగా అభిమానులంతా ఎక్కువగా ఇప్పుడు ఆచార్య సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ ఎంతో అద్భుతంగా తెరకెక్కించి ఉంటారని చెప్పవచ్చు. ఈ సినిమాకి సంగీతాన్ని మణిశర్మ అందించడం జరిగింది.. ఇక అంతే కాకుండా ఇందులో రామ్ చరణ్, పూజా హెగ్డే కలిసి జంటగా నటిస్తున్నారు. ఇక చిరంజీవి చరణ్ ఇద్దరు కూడా ఇందులో ఒక పాత్రలో కనిపించబోతున్నారు తెలుస్తోంది. ధర్మస్థలి అనే ఒక ప్రాంతం చుట్టూ అల్లుకొన్న కథ ఇది.

అయితే ఓకే ధర్మం కోసం పోరాడేటువంటి ఇద్దరు వ్యక్తులు చేసే పోరాటమే ఈ కథ అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్నది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో చాలా జోరుగా చేస్తున్నారు చిత్ర బృందం. అయితే ఇలాంటి సమయంలోనే డైరెక్టర్ కొరటాల శివకు ఒక విచిత్రమైన ప్రశ్న ఎదురయింది.. అదేమిటంటే మీకు బాగా నచ్చిన సినిమాలు ఏంటో చెప్పండి అని ఒక ఇంటర్వ్యూలో అడగగా.. అందుకు కొరటాల శివ స్పందిస్తే సాగరసంగమం అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేశారు.

అయితే ఆ చిత్రం ఎందుకు ఇష్టమంటే కళ పట్ల అంకితభావం, ప్రేమ పట్ల త్యాగం అనే.. జీవితానికి గల పరమార్థం అనేది ఈ చిత్రంలో బాగా కనిపిస్తాయి అని తెలియజేశాడు. ఇక వీటితోపాటుగా శంకర్ డైరెక్షన్లో వచ్చిన భారతీయుడు సినిమా అన్న కూడా తనకి చాలా ఇష్టమట. అవినీతికి సహించలేని ఒక నాయకుడి కథ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇక అందులో అవినీతికి పాల్పడిన తన కుమారుడు అయిన సరే శిక్ష అనుభవించాల్సిందే అనే విధంగా ఒక తండ్రి కథాంశంతో శంకర్ ఎంతో గొప్పగా సినిమాను తెరకెక్కించాలని తెలియజేశారు. అందుచేతనే ఇప్పటికీ చిత్రాల గురించే మాట్లాడుకుంటున్నారని తెలిపారు కొరటాల శివ. ఇక స్క్రిప్టు విషయంలో తను ఎలాంటి పరిస్థితులలో రాజీపడని తేల్చిచెప్పేశాడు శివ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: