కెజీఎఫ్ యూనిట్ కు అదిరిపోయే సర్ ప్రైజ్..
చిత్రంతో దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్‌కు ఎంత పేరు వచ్చిందో ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'హోంబలే ఫిలిమ్స్'కు కూడా అంతే పేరు వచ్చింది. ప్రస్తుతం హోంబలే ఫిలిమ్స్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారు మోగి పోయింది.ఈ నిర్మాణ సంస్థ చేస్తున్న తర్వాత చిత్రాన్ని కూడా అనౌన్స్ చేసింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ ఒక సర్ ప్రైజ్ ప్లాను చేసింది.కన్నడ కంఠీరవ, లెజెండరీ నటుడు రాజ్ కుమార్ మనవడు, దివంగత పునీత్ రాజ్ కుమార్ సోదరుడు, యాక్టర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ కుమార్‌తో హోంబలే ఫిలిమ్స్ కొత్త సినిమా అంటూ యువరాజ్ లుక్‌తో కూడిన పోస్టర్లను విడుదల చేశారు.
ఈ సినిమాతోనే యువరాజ్ కుమార్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్నాడు..యువరాజ్ కుమార్ పోస్టర్ ను విడుదల చేస్తూ దానికి వారసత్వం కొనసాగుతుందని క్యాప్షన్ ఇచ్చారు. పునీత్ రాజ్ కుమార్‌కు 'యువరత్న' లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన సంతోష్ ఆనంద్రమ్ ఈ చిత్రానికి డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే..పోస్టర్ విడుదల అయిన వెంటనే మంచి స్పందన వచ్చింది. సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది అని కన్నడ అభిమానులు అభిప్రాయ పడుతున్నారు..పునీత్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..