అందాల ముద్దుగుమ్మ
సమంత గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత తెలుగు
సినిమా ఇండస్ట్రీలో అనేక విజయవంతమైన సినిమాల్లో నటించి తన నటనతో, తన అందచందాలతో, తన హావభావాలతో ఎంతో మంది అభిమానుల మనస్సు ను గెలుచుకుంది. ఇలా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న
సమంత ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే శాకుంతలం
సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న
సమంత ప్రస్తుతం యశోద
సినిమా సినిమాలో నటిస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా
సమంత , విజయ్ దేవరకొండ హీరోగా
శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ
సినిమా లో
హీరోయిన్ గా నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే
పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ
సినిమా రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్ లో జరగనుంది. అయితే ఈ
సినిమా షూటింగ్ కోసం
సమంత తాజాగా
కాశ్మీర్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే
సమంత ఈ సినిమాతో పాటు ఉ ఒక
హాలీవుడ్ సినిమాకు నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.