ఆచార్య లో మార్పులు ఆసినిమా విజయాన్ని శాసిస్తాయ ?
వాస్తవానికి ‘ఆచార్య’ లో చరణ్ సిద్ధ పాత్ర చాల చిన్నది. అయితే చిరంజీవి సూచనలతో ఆపాత్ర నిడివి పెంచడమే కాకుండా ఆపాత్రకు ఒక హీరోయిన్ ను క్రియేట్ చేసి ఆమెతో ఒక పాట కూడ పెట్టవలసిన పరిస్థితి కొరటాలకు ఏర్పడింది అంటారు. అంతేకాదు ‘ఆచార్య’ మూవీలో క్రియేట్ చేసిన కాజల్ పాత్ర చాల పెద్దది అని అయితే ఇప్పుడు చరణ్ పాత్రకు హీరోయిన్ క్రియేట్ చేసిన పరిస్థితులలో సినిమా నిడివి మరింత పెరిగిపోతోంది అన్నభయంతో పూర్తిగా కాజల్ పాత్రను తీసేశారు అని అంటున్నారు.
దేవాలయాల విలువైన భూములను బడా రాజకీయ వేత్తలు ఆక్రమించుకున్న కొన్ని యదార్థ సంఘటనల నేపధ్యంలో ఈమూవీ కథను వ్రాసారట. అయితే అనవసరపు వివాదాలు ఎందుకని చిరంజీవి ఆకథలో చాల మార్పులు చేసి మూవీలో ఎటువంటి వివాదాస్పద డైలాగ్స్ లేకుండా మెగా స్టార్ జాగ్రత్త పడ్డాడని తెలుస్తోంది. దీనితో ఈమూవీని చూసిన సగటు ప్రేక్షకుడుకి చిరంజీవి చరణ్ లు కలిసి నటించడం తప్ప ఈమూవీలో సామాజిక స్పృహతో కనెక్ట్ అయ్యే అంశాలు ఉండకపోవచ్చు అన్న మాటలు వినిపిస్తున్నాయి.
అయితే కొరటాల శివ ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాడు. ఈమూవీ కథలో ఎవరి ఊహలకు అందని ట్విస్ట్ లు ఉన్నాయని ఆ ట్విస్ట్ లు ‘ఆచార్య’ ఘన విజయానికి సహకరిస్తాయి అంటున్నాడు. ఈమూవీ టిక్కెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వాలు అంగీకరించడంతో ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ ఎంత ఉండబోతున్నాయి అన్న చర్చలు అప్పుడే మొదలైపోయాయి. ఇలాంటి పరిస్థితులలో ‘ఆచార్య’ మెగా అభిమానుల సినిమాగా రిజల్ట్ తెచ్చుకుంటుందా లేకుంటే సగటు ప్రేక్షకుడు మెచ్చే మూవీగా మారుతుందా అన్న విషయం ఈవారం తేలిపోతుంది..