మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో చిత్ర బృందం ఈ సినిమా లోని పాటలను ఒక దాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ వస్తోంది. ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటి వరకు ఆచార్య సినిమా నుండి చిత్ర బృందం నాలుగు పాటలను విడుదల చేయగా, ఈ నాలుగు పాటలకు కూడా ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలకపాత్రలో నటించబోతున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ఆచార్య' సినిమాలో సిద్ద అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ముందుగా ఆచార్య సినిమాలో రామ్ చరణ్ పోషించిన సిద్ధ అనే పాత్రను 15 నిమిషాల నిడివి వరకు ఉంచాలి అని చిత్ర బృందం అనుకున్నారట.
కాకపోతే ఆ తర్వాత రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్ర బాగా రావడంతో ఈ పాత్ర నిడివి పెంచుతూ వచ్చారట. దానితో కాస్త 15 నిమిషాలు అనుకున్నా సిద్ధ పాత్ర 45 నిమిషాల వరకు ఈ సినిమాలో ఉండనునట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ పాత్ర 'ఆచార్య' సినిమాలో ఫస్ట్ హాఫ్ లను సెకండ్ హాఫ్ లను ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.