పవన్ 'ఖుషి' మూవీ కి 21 ఏళ్ళు... అలనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న భూమిక..!

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విడుదల అవుతూ ఉంటాయి. అలా విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉంటే , కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించి మంచి విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకుంటూ ఉంటాయి.  అలాగే మరికొన్ని సినిమాలు మాత్రం కల్ట్ క్లాసిక్ లుగా మిగిలిపోతాయి.  ఆ సినిమాలు ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి.   తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలాంటి కల్ట్ క్లాసిక్  సినిమాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఖుషి సినిమా ఒకటి.  ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు అప్పటివరకు ఉన్న ఇమేజ్ ను అమాంతం పెంచింది.  


అలాగే ఈ సినిమాలో నటించిన భూమిక చావ్లా ఇమేజ్ కూడా అమాంతం ఒక్కసారిగా పెరిగిపోయింది.  అలాగే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఎస్ జె సూర్య కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ దర్శకుడిగా పెరిగిపోయడు. ఖుషి మూవీ కి పని చేసిన నటీనటులకు,  సాంకేతిక నిపుణులకు అందరికీ ఒక్కసారిగా ఫుల్ క్రేజ్ వచ్చేసింది.  అది మాత్రమే కాకుండా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ విజయంగా నిలిచిన ఖుషి సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.  ఇదిలా ఉంటే ఇలాంటి కల్ట్  క్లాసిక్ సినిమా ఖుషి ఈ రోజుతో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  


ఇలా 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి ఖుషి సినిమాలో హీరోయిన్ గా నటించిన భూమిక చావ్లా తాజాగా తన సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించింది.  భూమిక చావ్లా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ...  ఖుషి సినిమా 21 ఈ రోజుతో సంవత్సరాలు  పూర్తి చేసుకుంది.  పూర్తి జ్ఞాపకాలు మరియు నమ్మశక్యం కాని ప్రయాణం అని భూమిక రాసుకొచ్చింది. ఖుషి సినిమాలో మధు పాత్ర  నేను నా సినీ కెరియర్ లో అత్యంత ఆరాధించే , ప్రేమించే పాత్రలో ఒకటి గా మార్చింది.  అలాగే  ఈ మూవీ ప్రొడ్యూసర్ ఏ ఎం రత్నం , దర్శకుడు ఎస్ జె సూర్య , హీరో పవన్ కళ్యాణ్ గారికి భూమిక చావ్లా ధన్యవాదాలు తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: