టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న దర్శకులలో కొరటాల శివ ఒకరు. కొరటాల శివ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి సినిమాతో దర్శకుడిగా కెరియర్ ని మొదలు పెట్టిన కొరటాల శివ మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన శ్రీ మంతుడు , జనతా గ్యారేజ్ , భరత్ అనే నేను సినిమా లు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. ఇలా వరుస విజయా లతో ఫుల్ జోష్ మీద ఉన్న కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఈ నెల 29 వ తేదీన విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే తాజా ఇంటర్వ్యూ లో దర్శకుడు కొరటాల శివ , రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
తాజా ఇంటర్వ్యూ లో కొరటాల శివ కు ప్రభాస్ గారి తో మీరు పని చేశారు కాబట్టి, ప్రభాస్ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు అనే ప్రశ్న ఈ దర్శకుడికి ఎదురవగా... ఆ ప్రశ్నకు కొరటాల శివ సమాధానమిస్తూ... ప్రభాస్ నిజమైన డార్లింగ్ అంటూ ఒక మాట లో ప్రభాస్ గురించి కొరటాల శివ సమాధానమిచ్చాడు. ఇది ఇలా ఉంటే కొరటాల శివ 'ఆచార్య' సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే మూవీ కి దర్శకత్వం వహించబోతున్నారు.