మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. ఈ మూవీ లో రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఈ సినిమా ఏప్రిల్ 29 వ తేదీన భారీ ఎత్తున విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఆచార్య చిత్ర బృందం నిన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను భారీ ఎత్తున నిర్వహించింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ కు దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, బాబీ, మోహన్ రాజా, మెహర్ రమేష్ , పూజా హెగ్డే, రామ్- లక్ష్మణ్ అతిథులుగా హాజరయ్యారు. ఆచార్య ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో భాగంగా దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవి మూవీ అంటే ఒక పండగలా ఉంటుంది. అలాంటిది దర్శకుడు కొరటాల శివ... మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఒకే సినిమాలో చూపిస్తున్నారు.
దానితో ఈ మూవీ ఫ్యాన్స్ కు కన్నుల పండగే. ఆచార్య మూవీ లోని ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ ను నేను చూశాను. మునుపెన్నడూ చూడని మెగాస్టార్ చిరంజీవి ని చూస్తారు. బంజారా సాంగ్ లో చిరంజీవి , రామ్ చరణ్ డ్యాన్స్ ఐఫీస్ట్‌లా ఉంటుంది' అని ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో భాగంగా మెహర్ రమేష్ తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దర్శకుడు మెహర్ రమేష్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.