సోషల్ మీడియా తప్పుడు ప్రచారం వల్ల ఆ హీరోయిన్ కెరీర్ పోయిందిగా?

VAMSI
ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. లోకల్ టు గ్లోబల్ ఏ వార్త అయినా ఇక్కడ మనకు అవైలబుల్ లో ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించే ఎక్కువగా చర్చలు జరుగుతుండటం, వారికి సంబందించిన పలు వార్తలు వస్తుండటం జరుగుతుంటాయి. అయితే ఇక్కడ అన్ని నిజమవ్వాలని లేదు ఎందుకంటే సెలబ్రెటీల గురించి ఏ న్యూస్ వచ్చినా తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు నెటిజన్లు. అయితే ఇదే పాయింట్ ను మూలంగా చేసుకుని తరచూ సెలబ్రెటీల గురించి న్యూస్ లు రాస్తుంటాం. వీటిలో అన్ని వాస్తవాలే కాదు కదనాలు, అవాస్తవాలు కూడా ఉంటాయి. నిజమయితే వేరే విషయం కానీ అవాస్తవం అయి ఉండి అందులోనూ నెగిటివ్ న్యూస్ అయితే మాత్రం ఆ సెలబ్రిటీలు ప్రభావితం అవుతారు.

కొన్ని సార్లు ఇవి వారి కెరియర్ ను కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇలాంటిదే ఒకటి ఈ మధ్య చోటుచేసుకుంది. నటి శ్రీ విద్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మనసారా సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమయిన ఈమె తన టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈమెపై ఇటీవల ఒక చెత్త న్యూస్ ప్రచారమయ్యింది. ఈమె వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది అంటూ పలు  మీడియాలు కోడై కూశాయి. ఒక మీడియా ఏదో అనుకుని ఏదో రాస్తే అది చూసి మరికొన్ని మీడియాలు కూడా ఆ వార్తను స్ప్రెడ్ చేయడంతో ఈ విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీంతో ఆమె కెరియర్ దెబ్బతింది. ఆమెకు అవకాశాలు తగ్గాయి, అంతే కాకుండా మానసిక ఆవేదనతో ఆమె కుంగిపోయారు.

కానీ కట్ చేస్తే అసలు విషయం బయటపడింది. వ్యభిచారం కేసులో పోలీసులకు దొరికిన అమ్మాయి శ్రీ విద్య కాదు విద్య శ్రీ. అసలు వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల రైడ్ లో ఒక మూవీ ఆర్టిస్ట్ దొరికింది ఆమె పేరు విద్య శ్రీ. అదే విషయాన్ని వారు వెల్లడించారు. అయితే అక్కడ కొన్ని మీడియాలు దొరికింది శ్రీ విద్యనే అనుకుని న్యూస్ ను వైరల్ గా మార్చారు, దాంతో విషయం కాస్త మిస్ఫైర్ అయ్యింది. ఇది కాస్త శ్రీ దివ్య కెరియర్ పై ప్రభావం చూపింది. అయితే విషయం కనుగొన్న తరవాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీ దివ్య అసలు విషయం తెలిపి, సదరు మీడియాలు ఇలాంటి న్యూస్ లు ప్రచారం చేసేటప్పుడు పూర్తి వివరాలు కచ్చితమైన డేటా తీసుకుని చేయాలని లేదంటే తనలా చేయని తప్పుకు బాధపడాల్సి వస్తుంది అని శాతంగానే మీడియా వారికి చివాట్లు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: