యాష్ హీరోగా
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ టు
సినిమా ప్రస్తుతం విజయవంతంగా
థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 14 వ తేదీన భారీ అంచనాలతో
థియేటర్ లలో విడుదల అయిన కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ విడుదలైన ప్రతి చోట నుండి పాజిటివ్ టాక్ ను సాధించుకొని అదిరిపోయే కలెక్షన్ లను వసూలు చేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇలా అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా విజయవంతంగా
థియేటర్ లలో ప్రదర్శించబడుతున్న కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాపై ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు.
ఇది ఇలా ఉంటే తాజాగా కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ పై
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. కే జీ ఎఫ్ చాప్టర్ 2
మూవీ యూనిట్ కు అభినందనలు. ఈ
మూవీ లో యశ్ చాలా బాగా నటించాడు. రవీనా టాండన్, సంజయ్ దత్, శ్రీ
నిధి శెట్టి పాత్రలు చాలా బాగున్నాయి.
రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా అద్భుతంగా ఉంది.
కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ కి వర్క్ చేసిన టెక్నీషియన్లు అందరికీ అభినందనలు. దర్శకుడు ప్రశాంత్ నీల్ గారు
మూవీ ని రూపొందించిన తీరు బాగుంది. గొప్ప
మూవీ ని చూసిన ఫీలింగ్ ని అందించినందుకు,
ఇండియన్ సినిమాను శిఖర స్థాయిలో నిలిపినందుకు ఈ
మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు అని
అల్లు అర్జున్ పేర్కొన్నాడు. ఇలా
అల్లు అర్జున్ కే జి ఎఫ్ చాప్టర్ 2
మూవీ బృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు.