ఆ విషయంలో 'ఆర్ఆర్ఆర్' టచ్ చేయలేకపోయిన 'కేజిఎఫ్ చాప్టర్ 2'..!
ఇది ఇలా ఉంటే 'ఆర్ ఆర్ ఆర్' సినిమా తర్వాత అతి తక్కువ రోజుల గ్యాప్ లో విడుదల అయిన 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కి సంబంధించిన మొదటి వారం కలెక్షన్ల రికార్డ్ లను అవలీలగా క్రాస్ చేస్తుంది అని చాలా మంది భావించారు. కాకపోతే 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం సాధించిన కలెక్షన్లను బీట్ చేయడంలో 'కే జి ఎఫ్ చాప్టర్ 2' సినిమా కాస్త తడబడింది అని చెప్పవచ్చు. 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కలెక్షన్ లను గ్రాస్ కలెక్షన్ల పరంగా క్రాస్ చేసినప్పటికీ, షేర్ కలెక్షన్ల పరంగా 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ని 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ క్రాస్ చేయలేకపోయింది. 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారం ముగిసే సరికి 357.01 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేయగా, 719 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇలా 'కే జి ఎఫ్ చాప్టర్ 2' మూవీ 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షేర్ కలెక్షన్లను మొదటి వారం క్లాస్ చేయలేకపోయింది.