ఆ హీరోయిన్ తో నటించాలని ఉంది : యష్

praveen
హీరో యష్ అంటే మొన్నటి వరకు కేవలం కన్నడ హీరో గా మాత్రమే అందరికీ తెలుసు. కన్నడ ఇండస్ట్రీ లో కూడా ఒక సాదా సీదా హీరోగానే కొనసాగాడు. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. కన్నడ ఇండస్ట్రీ లో మాత్రమే కాదండోయ్ భారతదేశ వ్యాప్తంగా కూడా హీరో యష్ అంటే తెలియని సినీ ప్రేక్షకుడు లేడు నేటి రోజుల్లో అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కే జి ఎఫ్ సినిమా తో సంచలనం సృష్టించిన యష్ ఇక ఇటీవల కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడూ.


 ఏప్రిల్ 14వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఇంకా థియేటర్లలో గర్జిస్తూ నే ఉంది. బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతూ బాహుబలి రికార్డులను సైతం బ్రేక్ చేసింది కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా. ఇప్పటికే 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా 1000 కోట్ల మార్కును అందుకునే దిశగా పరుగులు పెడుతోంది. ఇక అదే సమయంలో అటు చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. కే జి ఎఫ్ చాప్టర్ 2 తర్వాత యష్ అందరూ దర్శకులకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు.


 ఇకపోతే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కేజిఎఫ్ హీరో యష్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు.. ఇక ఏ హీరోయిన్ తో నటించాలని ఉంది అన్న విషయాన్ని ఇటీవల చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ లో ఏ హీరోయిన్ తో నటించాలని ఉంది అని అడగగా దీపిక పదుకొనే తో నటించాలని ఉంది అంటూ మనసులో మాట బయట పెట్టాడు యష్. అంతే కాకుండా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని తో కలిసి పని చేయాలని ఉంది అంటూ హీరో యాష్ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు కే జి ఎఫ్ సినిమా తో సెన్సేషనల్ స్టార్ గా మారిపోయిన యష్ కోసం ఇప్పటికే బాలీవుడ్ డైరెక్టర్స్ కథలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరీ రానున్న రోజుల్లో ఈ కన్నడ హీరో కోరిక తీరుతుందా లేదా అన్నది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: