
టాలీవుడ్ ఇండస్ట్రీ పై కన్నేసిన ఆ ఇద్దరు సౌత్ ముద్దుగుమ్మలు..!
రష్మిక మందన : నేషనల్ క్రష్ రష్మిక మందన 'పుష్ప' సినిమా తో వచ్చిన క్రేజ్ తో వరస పెట్టి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం రష్మిక మందన బాలీవుడ్ లో మిషన్ మజ్నూ, గుడ్ బై సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం లో తెరకెక్కుతున్న యానిమల్ ఈ సినిమా లోనూ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా నేషనల్ క్రష్ రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ జోష్ ను చూపిస్తుంది.
సమంత : అందాల ముద్దుగుమ్మ సమంత కు సౌత్ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా అదే జోష్ లో దూసుకు పోతుంది. ఇప్పటికే ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ ద్వారా హిందీ ప్రేక్షకులను అలరించిన సమంతా ప్రస్తుతం వరుణ్ ధావన్ సరసన ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇలా సమంత కూడా బాలీవుడ్ కి ప్రేక్షకులని అలరిస్తోంది.