పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏం చేస్తున్నాడో తెలుసా?

frame పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ఏం చేస్తున్నాడో తెలుసా?

Satvika
తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే..పవన్ సినిమా వస్తుంది అంటే వాళ్ళ హంగామా మాములుగా ఉండదు. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి థియెటర్లలోకి వచ్చేవరకు సోషల్ మీడియాలో సినిమా గురించి పదే పదే చెబుతూ సినిమా పై అంచనాలను పెంచేలా చేస్తారు..అయితే గతంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన జనాలకు మంచి చేయాలని సినిమాలను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే..మళ్ళీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ మేరకు ఇటీవల వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్..


ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో వరుస సినిమాలు చేసెందుకు రెడీ అయ్యాడు. తాజాగా భీమ్లానాయక్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.ఆ సినిమాకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా మంచి సక్సెస్ ను అందుకుంది.అదే జోష్ తో ఇప్పుడు మరో రెండు , మూడు ప్రాజెక్టులలో నటిస్తున్నారు..ముందుగా క్రిష్‌ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత హరీశ్‌ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత సురేందర్‌రెడ్డతో ఓ సినిమా కమిట్‌ అయి ఉన్నారు. అయితే హరిహరి వీరమల్లు చిత్రం తర్వాత పవన్‌ ఎవరి డైరెక్షన్‌లో సినిమా చేస్తారన్న అంశం పై సినీ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి..


టాలీవుడ్‌లో వినిపిస్తున్న టాక్‌ ప్రకారం.. పవన్‌ నెక్ట్స్‌ స్టెప్‌ హరీశ్‌ శంకర్‌ సినిమాకే అని టాక్. జులై ,ఆగస్ట్‌లో ఓ షెడ్యూల్‌ చేసుకోమని పవన్‌ డేట్స్‌ ఇచ్చారట. అందుకే హరీశ్‌ ఈ సినిమా పనులను వేగవంతం చేశారు. ఈ మధ్యనే రెండుమూడు సార్లు హరీశ్‌ పవన్‌కల్యాణ్‌ని కలిసి డేట్లు ఇవ్వమని కోరాడట..అందుకు పవన్‌ సానుకూలంగా స్పందించారని తెలిసింది. ఇప్పటికే స్ర్కిప్ట్‌ వర్క్‌ ను డైరెక్టర్ పూర్తీ చేశారు. ఇందులో ముగ్గురు హీరోయిన్‌లకు స్కోప్‌ ఉందని, ఇప్పుడు ఆ పనిలో ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: