డైరెక్టర్ క్రిష్ భార్యతో విడాకులకు ఆ హీరోయిన్ కారణమా?
క్రిష్ ఆయన భార్య రమ్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడిపోయి మూడేళ్లు గడుస్తోంది.
అయితే వీరు విడిపోవడానికి కారణాలు ఇవే అంటూ అప్పట్లో చాలా వార్తలు చక్కెర్లు కొట్టగా.. ఇపుడు మరో సారి ఆ విడాకుల వార్త వైరల్ గా మారింది. ఇదే అసలైన కారణమని అంటున్నారు. ఒక హీరోయిన్ కారణంగానే వీరిద్దరూ విడిపోయారని టాలీవుడ్ నుండి టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్ క్రిష్ 2016 ఆగస్టు 7వ తేదీన రమ్యను అందరి సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్నారు. అయితే కొద్ది కాలానికే వీరి మద్య మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. చివరికి 2018 లో విడాకులు తీసుకుని చట్ట బద్ధంగా విడిపోయి ఎవరి జీవితం వారు గడుపుతున్నారు. కాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి కారణం ఒక హీరోయిన్ అన్న మాటలు ఇపుడు టాలీవుడ్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి.
అప్పట్లో డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో ఒక మూవీలో నటించిన హీరోయిన్ తో చాలా చనువుగా ఉండడం చూసిన రమ్య భర్త క్రిష్ కు ఆమెకు దూరంగా ఉండాలి అంటూ పలుసార్లు చెప్పారని, అయినా క్రిష్ లో మార్పు రాకపోవడంతోనే మానసికంగా కుంగిపోయిన రమ్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అని అలా విడిపోయారు అని అంటున్నారు. అయితే ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ..ఏమిటి అన్న వివరాలు బయటకు రాలేదు. ప్రస్తుతం క్రిష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వైవిధ్య భరితమైన చిత్రాలు తీయడంలో దిట్ట దర్శకుడు క్రిష్. అందులోనూ ప్రేక్షకుల మనసు తెలిసిన డైరెక్టర్ గా పేరుగాంచాడు.