ఎఫ్3 నుంచి మరో క్రెజీ అప్డేట్..

Satvika
వెంకీ సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ వుంది.. అన్నీ రకాలుగా వెంకీ నటిస్తాడు.దాంతో సినిమా పై భారీ హిట్ ను అందుకుంటుంది..వెంకీ పెర్ఫార్మెన్స్ తో సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి. రెండేళ్ల క్రితం సంక్రాంతికి విడుదల అయ్యి ఘన విజయాన్ని అందుకున్న సినిమా ఎఫ్2.. ఈ సినిమా కలెక్షన్స్ ను ఎ సినిమా బీట్ చేయలేదు.. ఆ ఏడాది మొత్తానికి ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను అందుకుంది.ఇకపొతే ఆ సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను తెరకెక్కించాలని చిత్రయూనిట్ భావించారు..


అనుకున్న విధంగా ఆ సినిమాకు సీక్వెల్ సినిమాను తెరకెక్కించారు.. ఎఫ్3 టైటిల్ తో సినిమా ప్రెక్షకుల ముందుకు రానుంది.సినిమా షూటింగ్ పనులను పూర్తీ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మొదటి సినిమా కన్నా కూడా ఎక్కువ ఆసక్తిగా వుంటుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను విడుదల చేశారు..ఆ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ను చిత్రయూనిట్ వెల్లడించారు..


ఈ సినిమాలో ఓ హాట్ ఐటెం సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఐటెం సాంగ్‌లో అందాల భామ పూజా హెగ్డే స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనుంది. ఇక ఈ సినిమాతో మరోసారి కామెడీ జోనర్ సినిమాల సక్సెస్ ట్రాక్‌ను కంటిన్యూ చేసేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు.. ఈ నెల 22 న ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను విడుదల చేసెందుకు ప్లాన్ చేస్తున్నారు.హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్‌లతో పాటు మరో బ్యూటీ సోనాల్ చౌహన్ కూడా ఓ తాడును తమవైపుకు లాగుతుంటే, మరోవైపు హీరో వరుణ్ తేజ్ ఒక్కడే తాడును తనవైపుకు లాగుతున్నాడు..మే 29న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసెందుకు చిత్రబృందం ప్రకటించింది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: