'ఆచార్య' సినిమాను వెంటాడుతున్న పూజా హెగ్డే ఫెయిల్యూర్ సెంటిమెంట్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఒక లైలా కోసం సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.  ఒక లైలా కోసం మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినా ఇప్పటికీ ఈ సినిమాతో పూజాహెగ్డే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.  ఇది ఇలా ఉంటే ఒక లైలా కోసం సినిమా తర్వాత బాలీవుడ్  ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టిన పూజా హెగ్డే కు అక్కడ అక్కడ మాత్రం ఆశించిన ఫలితం లభించలేదు.  


ఆ తర్వాత తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసిన పూజా హెగ్డే కు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కింది. అందులో భాగంగా పూజా హెగ్డే నటించిన సినిమాలు కూడా చాలా శాతం విజయం సాధించడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో పూజా హెగ్డే స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది.  ఇది ఇలా ఉంటే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన పూజా హెగ్డే కు తాజాగా మాత్రం వరుస అపజయాలు వెంటాడుతున్నాయి.  ఈ ముద్దుగుమ్మ నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ వస్తోంది.  కొన్ని రోజుల క్రితం విడుదలైన రాధే శ్యామ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది,  ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. తాజాగా పూజ హెగ్డే 'బీస్ట్' మూవీ లో హీరోయిన్ గా నటించింది,  ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకుంది.  ఇలా పూజా హెగ్డే నటించిన రెండు సినిమాలు వరుసగా బాక్సాఫీసు దగ్గర మిక్సీడ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం పూజా హెగ్డే నటిస్తున్న ఆచార్య సినిమాపై ఈ ప్రభావం పడుతుందేమో అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: