సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు గీత గోవిందం సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది, ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేసింది. సర్కారు వారి పాట చిత్ర బృందం విడుదల చేసిన ఈ సినిమా పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
మరీ ముఖ్యంగా సర్కారు వారి పాట సినిమా లోని కళావతి సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ ల కొద్దీ వ్యూస్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది, ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇది ఇలా ఉంటే సర్కారు వారి పాట సినిమాను కొంత కాలం క్రితం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను చిత్ర బృందం సంక్రాంతి బరి నుండి తప్పించింది, ఆ తర్వాత సర్కారు వారి పాట చిత్ర బృందం ఈ సినిమాను మే 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సర్కారు వారి పాట సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభం కానట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే దగ్గర పడింది. ఇప్పటి వరకు కూడా ఈ సినిమా డబ్బింగ్ పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ సినిమా మే 12 వ తేదీన విడుదల అవుతుందా లేదా అని మహేష్ బాబు అభిమానులు టెన్షన్ పడుతున్నారు.