టాలీవుడ్ స్టార్స్ లో అత్యధిక బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న స్టార్ ఎవరంటే ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు వరుసగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ బాగా దూసుకు పోతున్నాడు.ఇక
లోకల్ నుండి నాన్
లోకల్ వరకు ఎన్నో రకాల బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఇంటర్నేషనల్ లెవల్ బ్రాండ్ కు ఆయన అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు.ఇంటర్నేషనల్ రేంజ్ మోడల్స్ ఇంకా అలాగే స్టార్స్ అంబాసిడర్స్ ఇంకా
బాలీవుడ్ స్టార్స్ మాత్రమే వ్యవహరించే
ఆడి కారు కు ఇప్పుడు సౌత్
ఇండియా తరపున సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్
ఇండియా మొత్తం కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు తో
ఆడి మార్కెట్ ను పెంచేందుకు కంపెనీ
విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
ఆడి కంపెనీ కారుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు గాను సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ పారితోషికంను తీసుకుంటున్నట్లుగా సమాచారం అనేది అందుతోంది. ఇక ఇప్పటి దాకా ఆయన తీసుకున్న పారితోషికాల అన్నింటికంటే ఎక్కువగా
ఆడి పారితోషికం అందుకోబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది.ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఒక ప్రాంతీయ హీరోని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుందంటే సుపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.ఇక సినిమాల విషయానికి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట
సినిమా చివరి వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అయ్యింది. హీరోగా ఆయన వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదల అవ్వడమే ఆలస్యం
జూన్ నెలలో
త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ పట్టాలెక్కబోతుంది. ఆ తర్వాత యస్ యస్
రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక పాన్
ఇండియా సినిమాను చేయబోతున్నాడు.