'ఆర్ఆర్ఆర్' ను టచ్ చేయలేకపోయిన 'కేజిఎఫ్ చాప్టర్ 2'..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటించగా,  జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ కథానాయికగా నటించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అజయ్ దేవ్ గన్ , శ్రేయ ,  సముద్ర కని ఇతర ప్రధాన పాత్రలో నటించారు. ఇలా ఎంతో భారీ తారాగణంతో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా పోయిన నెల మార్చి 25 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైంది. అలా భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.


ఇలా ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్ లను మొదటి రోజు వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ చాప్టర్ 2  సినిమా ఆర్ ఆర్ ఆర్ మొదటి రోజు రికార్డ్ ను బద్దలు కొడుతుంది అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రాబట్టిన కలెక్షన్ లను బీట్ చేయలేకపోయింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 223 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వసూలు చేస్తే, కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 165 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేసిన కలెక్షన్ లను  బీట్ చేయలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: