రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ ని డామినేట్ చేసిన కేజీ ఎఫ్ 2 ?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గర్వింప దగ్గ సినిమాగా ‘ఆర్ ఆర్ ఆర్’ ను ప్రమోట్ చేసారు. ఈసినిమాకు పోటీగా మరే సినిమా విడుదల కాకుండా అన్ని రాష్ట్రాలలోను జాగ్రత్తలు తీసుకున్నారు. దేశంలోని ప్రముఖ సెలెబ్రెటీలు అంతా ‘ఆర్ ఆర్ ఆర్’ ఘనవిజయం సాధించి ‘బాహుబలి 2’ రికార్డులను దాటిపోవాలని మనసారా కోరుకున్నారు.
మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీని తెలుగు ప్రజల కీర్తిగా పరిగణించి ఆసినిమాకు సంబంధించిన టిక్కెట్ల రేట్ల పెంపుదల విషమై భారీగా సహకరించాయి. అయితే ఒక్క తెలుగు రాష్ట్రాలలో తప్ప ‘ఆర్ ఆర్ ఆర్’ హవా మిగిలి రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో కనిపించలేదు. అయితే దీనికి భిన్నంగా లేటెస్ట్ గా విడుదలైన ‘కేజీ ఎఫ్ 2’ కేవలం కర్ణాటకలో మాత్రమే కాకుండా తమిళనాడు కేరళా ఉత్తరాది రాష్ట్రాలలో కలక్షన్స్ విషయంలో పెను సంచలనం సృష్టిస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ మొదటిరోజు కలక్షన్స్ స్థాయిని దాటిపోయింది అని వస్తున్న వార్తలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ బడ్జెట్ లో ‘కేజీ ఎఫ్ 2’ కు ఖర్చుపెట్టిన బడ్జెట్ సగం కూడ ఉండడు. అయినప్పటికీ ఈమూవీకి వచ్చిన ఓపెనింగ్ కలక్షన్స్ చాల రాష్ట్రాలలో ‘ఆర్ ఆర్ ఆర్’ ను మించి ఉండటం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. దీనికితోడు ‘ఆర్ ఆర్ ఆర్’ చరణ్ జూనియర్ లు కలిసి నటించిన మల్టీ స్టారర్ అయితే ‘కేజీ ఎఫ్ 2’ బరువు అంతా సిల్వర్ స్క్రీన్ పై యష్ మోసాడు.
దీనితో రాజమౌళి మ్యానియా చేయలేని అద్భుతం ప్రశాంత్ నీల్ చేయగలిగాడు అంటూ దక్షిణాది ఇండస్ట్రీ ప్రముఖులు ఆశ్చర్య పడుతున్నారు. తమిళనాడులో ఈసినిమాకు పోటీగా టాప్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ విడుదలైనప్పటికీ విజయ్ మ్యానియా కూడ ‘కేజీ ఎఫ్ 2’ మ్యానియా ముందు షేక్ అయింది..