'ఎఫ్ 3' సెట్ లోకి ఎంటర్ అయిన పూజా హెగ్డే..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ ఒక లైలా కోసం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత పూజా హెగ్డే అనేక తెలుగు సినిమాలలో నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది.  ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది.  ఇది ఇలా ఉంటే ఈ మధ్యనే పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్ , బీస్ట్ మూవీలు విడుదలయ్యాయి. రాధే శ్యామ్  సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.  


బీస్ట్ మూవీ ప్రస్తుతం థియేటర్లో ప్రదర్శించబడుతుంది.  ఇది ఇలా ఉంటే పూజా హెగ్డే నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29 వ తేదీన విడుదల కాబోతుంది.  ఇలా సినిమాలో హీరోయిన్ పాత్రలతో ఫుల్ బిజీగా ఉన్నా పూజా హెగ్డే ప్రస్తుతం ఐటమ్ సాంగ్ లపై కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది.  ఇప్పటికే పూజా హెగ్డే,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా లో జిగేల్ రాణి అనే ఐటెం సాంగ్ లో కనిపించి తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే మరోసారి పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో  కనిపించబోతోంది.  పూజా హెగ్డే ఈ సారి అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్,  వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది. తాజాగా ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.  మరి ఈ సాంగ్ తో పూజ హెగ్డే ప్రేక్షకులన అమెరా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: