కేజిఎఫ్ 2 బ్లాక్ బస్టర్.. ప్రభాస్ అభిమానులు హ్యాపీ?
ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది అంటూ ఇక ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు రివ్యూ ఇస్తూ ఉండడం గమనార్హం.. కే జి ఎఫ్ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయం అంటూ చెబుతున్నారు ప్రేక్షకులు. ఇక కే జి ఎఫ్ చాప్టర్ 2 లో యాక్షన్ సీక్వెన్స్ అయితే ఊహకందని విధంగా అబ్బురపరిచే విధంగా ఉన్నాయ్ అని చెబుతున్నారు. ఇదే సమయంలో అటు ప్రభాస్ అభిమానులు కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా తరువాత ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ సినిమా తీస్తున్నాడు.
కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా చూసిన తర్వాత ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు కే జి ఎఫ్ చాప్టర్ 2 లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ కనుక ప్రభాస్ కి పడితే ఇక అస్సలు తిరుగు ఉండదు అని ప్రభాస్ అభిమానులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. ప్రభాస్ నటించిన సాహో రాధేశ్యామ్ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ సలార్ మూవీతో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అని అంటున్నారు కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా చూసిన ప్రభాస్ అభిమానులు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ మరింత అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తీసే అవకాశం ఉంది అని అంటున్నారు.