జూనియర్ ఆతిధ్యం పై యష్ సంచలన వ్యాఖ్యలు !
దీనికితోడు ఈమూవీకి లాంగ్ వీకెండ్ కూడ కలిసి రావడంతో ఈమూవీ కలక్షన్స్ కు హద్దులేకుండా పోతోంది. ఈమూవీ సెకండ్ హాఫ్ లో కథ స్లోగా నడవడం ఈమూవీకి మైనస్ పాయింట్ గా మారే ఆస్కారం ఉంది అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఈమూవీ ప్రమోషన్ ను తెలుగు రాష్ట్రాలలో కూడ చాల భారీ స్థాయిగా చేస్తున్నారు. స్వయంగా యష్ రంగంలోకి దిగి ప్రమోట్ చేస్తూ తెలుగు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ తెలుగు వారికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాడు.
తనకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో ఉన్న సానిహిత్యం తెలియచేస్తూ ఇక్కడి హీరో అభిమానులను కూడ తన అభిమానులుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపధ్యంలో యష్ జూనియర్ ఆతిధ్యం పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను ‘కేజీ ఎఫ్ 2’ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ చాల అభిమానంతో తన ఇంటికి భోజనానికి పిలిచి ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు.
అంతేకాదు తారక్ తల్లి కన్నడ ప్రాంత వాసి కావడంతో తన కన్నడ అభిరుచులకు తగ్గట్టుగా ఆమె భోజనం తయారు చేయించడంతో తనకు తన ఇంటి భోజనం చేసిన ఫీలింగ్ కల్గింది అంటున్నాడు. తనకంటే తారక్ సీనియర్ నటుడు అయినప్పటికీ అతడు తన పై చూపించిన అభిమానం ఆయన సంస్కారాన్ని చాటుతుంది అంటూ యష్ జూనియర్ అభిమానుల ప్రాపకం పొందడానికి గట్టిగా ప్రయత్నించాడు. ఈనెలాఖరి వరకు మరొక పెద్ద సినిమా పోటీ లేకపోవడంతో ఈమూవీ తన టార్గెట్ ను చేరుకునే ఆస్కారం ఉంది..