నెటిజెన్ ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన శృతి హాసన్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఈ ముద్దుగుమ్మ ఎన్నో విజయవంతమైన సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది.   ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదలైన క్రాక్ ,  వకీల్ సాబ్ మూవీలతో శృతి హాసన్ బాక్సాఫీస్ దగ్గర రెండు బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంది.  ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా  సినిమా సలార్ లో హీరోయిన్ గా నటిస్తోంది.   ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ మూవీ తో పాటు శృతి హాసన్ , బాలకృష్ణ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

  ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో  మైత్రి మూవీ మేకర్స్  బ్యానర్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నా శృతి హాసన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలు పంచుకుంటూ ఉంటుంది.   ఇది ఇలా ఉంటే శృతి హాసన్ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో తన ఫాలోవర్ తో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింద.   ఈ సెషన్ లో చాలా మంది పలు రకాల ప్రశ్నలు అడగగా.. వాటికి శృతి హాసన్ సమాధానం చెప్పింది. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్  సెషన్ భాగంగా ఓ నెటిజన్  'నీ లిప్ సైజ్ ఎంత' అని వింత ప్రశ్నను అడిగాడు.  ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ ముందుగా  షాక్ అయ్యింది. ఆ తర్వాత ఆ నెటిజెన్ ప్రశ్నకు స్పందిస్తూ శ్రుతి హాసన్... పెదాల సైజ్ కూడా ఉంటుందా..?  అయితే ఇదిగో నువ్వే చూసుకుని కొలుచుకో అంటూ శృతి హాసన్ ఆ నెటిజన్ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చింది. అంతేకాదు, ఆమె పెదాలను బార్లా చాపి మరీ చూపించింది.  ఇలా నెటిజన్ ప్రశ్నకు శృతి హాసన్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: